News February 23, 2025
మెదక్: బర్డ్ ఫ్లూ దెబ్బకు ప్రజల్లో ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోవడంతో, చికెన్ ధరలు తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.180 ఉండగా ప్రస్తుతం రూ.130గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
Similar News
News February 23, 2025
విద్యుత్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఎన్నిక

విద్యుత్ కార్మిక సంఘం మెదక్ జిల్లా నూతన గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సెక్రటరీ ఓరం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తనను గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వం, కంపెనీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
News February 23, 2025
సిద్దిపేట: తెల్లారితే పెళ్లి.. గుండెపోటుతో తండ్రి మృతి

అంతా హడావుడి.. తెల్లారితే ఆ ఇంట్లో పెండ్లి ఉండగా ఇంతలోనే తీవ్ర విషాదం నెలకొంది. ఆనందం పట్ట లేకనో ఏమో తెలియదు కానీ ఆ ఇంటికి పెద్ద దిక్కు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన దుబ్బాక మండలం రామక్కపేటలో జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సత్యనారాయణ గౌడ్ సిద్దిపేటలో నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉదయం కొడుకు శ్రీనివాస్ వివాహం దుబ్బాకలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉండగా.. శనివారం ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
News February 23, 2025
సిద్దిపేట: విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడు

సిద్దిపేట జిల్లా కొండపాకలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌పై కేసు నమోదైంది. వివరాలు.. ఖమ్మంపల్లి పాఠశాల సైన్స్ టీచర్ దేవయ్య ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థినులతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దేవయ్య వేధింపులు భరించలేక విద్యార్థినులు హెచ్‌ఎంకు తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దేవయ్యపై కేసు నమోదు చేశారు. దేవయ్యను సస్పెండ్ చేసినట్లు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.