News January 27, 2025
మెదక్: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం

అనుమానస్పదంగా బావిలో మృతదేహం లభ్యమైన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. అప్పాజీపల్లికి చెందిన రాములు(45) నడిమి తండాకు చెందిన ఓ వ్యక్తి వద్ద 15 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు. రాములు 15 రోజుల నుంచి కనిపించకుండా పోయి బావిలో మృతి చెంది ఉన్నాడు. అతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 14, 2025
తూప్రాన్: ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ ఆఫీసర్ సమావేశం

తూప్రాన్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ పై ప్రత్యేక అధికారి (జెడ్పీ సీఈవో) ఎల్లయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ ప్రత్యేక అధికారిగా నియామకమైన జడ్పీ సీఈఓ ఎల్లయ్య మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో ఎల్ఆర్ఎస్ పై సమావేశం నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారు 31లోగా రుసుము చెల్లించి రాయితీ పొందాలని సూచించారు. కమిషనర్ గణేష్ రెడ్డి పాల్గొన్నారు.
News March 13, 2025
మగ, ఆడపిల్లలను సమానంగా చూడాలి: ఎస్పీ ఉదయ్

తల్లిదండ్రులు మన ఇంట్లోనుంచే మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మహిళా దినోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రులు మగ పిల్లలకు ఇచ్చే స్వేచ్ఛను ఆడపిల్లలకు ఇస్తూ మంచి విద్యను అందించాలన్నారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమన్నారు. మహిళలు ఈ రోజుల్లో తాము ఎందులోనూ తక్కువ కాదన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
News March 13, 2025
సంగారెడ్డి జిల్లాలో మహిళ హత్య

ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఆమె వద్దనున్న బంగారు కమ్మలు ఎత్తుకెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్ గ్రామంలో జరిగింది. స్థానికులు, ASI..కథనం ప్రకారం గ్రామానికి చెందిన గౌరమ్మ (45)ను బుధవారం అర్ధరాత్రి ఎవరో హత్య చేసి పరారయ్యారు. ఘటనా స్థలానికి SP పరితోష్ పంకజ్ చేరుకొని పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామన్నారు.