News December 28, 2024

మెదక్: మాజీ ప్రధానికి మంత్రి పొన్నం నివాళి

image

ఢిల్లీలో భారత మాజీ ప్రధాని మ‌న్మోహ‌న్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పుష్పాంజ‌లి ఘ‌టించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టిన ఆయన నిరాడంబరతకు ఆదర్శం అన్నారు.

Similar News

News December 29, 2024

2024 రౌండప్.. మెదక్‌లో బీఆర్ఎస్‌కు దెబ్బ !

image

సార్వత్రిక ఎన్నికలు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BRS కంచుకోటను పదుల పరుచుకుంది. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాల్లో BRS విజయం సాధించినప్పటికీ అధికారం కాంగ్రెస్ హస్తగతం అయింది. పటాన్‌చెరు ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరగా, మరికొందరు చేరుతారని ప్రచారం ఉంది. ఉమ్మడి జిల్లాలో సత్తా చాటినప్పటికీ BRSకు కోలుకోలేని దెబ్బ తగిలిందని విశ్లేషకులు అంటున్నారు. COMMENT

News December 28, 2024

రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ

image

రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై రూ.400 బోనస్‌ ఇచ్చి కంది రైతులను ఆదుకోవాలని కోరుతూ సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఎకరాల్లో 2.5లక్షల మెట్రిక్‌ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అన్నారు.

News December 28, 2024

మెదక్: మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామ శివారులోని ఏడుపాయల మంజీరా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. మంజీరా నదిలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి సుమారు 40-50 ఏళ్ల వయసు గలవారిగా గుర్తించారు. ఎవరికైనా మృతుడి సమాచారం తెలిస్తే సమాచారం అందజేయాలని పోలీసులు సూచించారు.