News April 22, 2025

మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

image

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 22, 2025

నిషేధం వార్తలపై స్పందించిన హర్ష భోగ్లే

image

IPLలో ఈడెన్ గార్డెన్ మ్యాచులకు తనను నిషేధించారన్న వార్తల్ని వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఖండించారు. కోల్‌కతాలో జరిగే 2 మ్యాచులకు మాత్రమే తనను ఎంపిక చేశారని, ఆ రెండూ పూర్తయ్యాయని వివరించారు. KKRకు ఈడెన్ గార్డెన్స్‌లో హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ దక్కడం లేదని సైమన్ డౌల్, హర్ష భోగ్లే అన్నారు. దీంతో వీరిని కోల్‌కతాలో జరిగే మ్యాచులకు దూరం పెట్టాలని BCCIని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కోరినట్లు వార్తలు వచ్చాయి.

News April 22, 2025

అల్లూరి: ‘25.50 లక్షల బుక్స్ అవసరం’

image

పాఠశాల తెరిచిన వెంటనే విద్యార్థులకు పాఠ్య, నోటు పుస్తకాలు అందించేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చెస్తుందని DEO బ్రాహ్మజిరావు మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 2,913 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాధమికొన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో 1,69,175 మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరికి 25.50 లక్షల బుక్స్ అవసరం అని తెలిపారు. ఈ నివేదిక ప్రభుత్వానికి పంపామని చెప్పారు.

News April 22, 2025

HYD: మన జిల్లాలకు వచ్చిన ర్యాంకుల వివరాలు

image

ఇంటర్ ఫస్టియర్‌లో..
మేడ్చల్ 77.21 శాతంతో స్టేట్ 1వ ర్యాంక్
రంగారెడ్డి 76.36 శాతంతో స్టేట్ 2వ ర్యాంక్
హైదరాబాద్‌ 66.68 స్టేట్ 7వ ర్యాంక్
వికారాబాద్ 61.31 స్టేట్ 12వ ర్యాంక్
ఇంటర్ సెకండియర్‌లో..
మేడ్చల్ 77.91 శాతంతో స్టేట్ 3వ ర్యాంక్
రంగారెడ్డి 77.53 శాతంతో స్టేట్ 4వ ర్యాంక్
వికారాబాద్ 68.20 స్టేట్ 21వ ర్యాంక్
హైదరాబాద్‌ 67.74 స్టేట్ 23వ ర్యాంక్

error: Content is protected !!