News April 6, 2025
మెదక్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య(39) నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పడుతున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 9, 2025
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

మెదక్ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు గులాబీ నేతలు, KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRS నేతలకు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్..?
News April 9, 2025
ఓయూలో 470 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు!

ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 601 మంజూరు పోస్టులకు గాను 131 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 470 ఖాళీలు ఉన్నాయి. అకాడమిక్ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో సగమే భర్తీ చేస్తారని సమాచారం.
News April 9, 2025
MDK: నేటి నుంచి పరీక్షలు

నేటి నుంచి 17 వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 9 నుంచి, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈనెల 11 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. పరీక్షలు ఉదయం గం.9 నుంచి మధ్యాహ్నం గం.12 వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.