News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య (39) తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి గోడపై నీరు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 14, 2025

మెదక్: అంబేడ్కర్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఏఎస్పీ

image

అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా నేటి యువత ఆయనను ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారన్నారు.

News April 14, 2025

మెదక్: వివాహిత మిస్సింగ్.. కేసు నమోదు

image

ఇంటి నుంచి వెళ్లిన ఒక వివాహిత కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని సికింద్లాపూర్‌కి చెందిన శ్యామల శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో భర్త సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 14, 2025

గుమ్మడిదల: భార్యతో గొడవ పడి ఆత్మహత్య

image

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీర్ల నాగరాజు (30) కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన అనితతో 15 నెలల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో నాగరాజు మనస్తాపానికి గురై వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.

error: Content is protected !!