News May 18, 2024

మెదక్‌లో 4 పాలిసెట్ పరీక్ష కేంద్రాలు

image

పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మెదక్ జిల్లా కేంద్రంలో 4 పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సువర్ణలత తెలిపారు. ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్ధార్థ ఆదర్శ జూనియర్ కళాశాల, సిద్ధార్థ మోడల్ హై స్కూల్‌లో ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు సమయానికి హాజరు కావాలని సూచించారు.

Similar News

News October 4, 2024

సిద్దిపేటలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

సిద్దిపేట పట్టణం శివాజీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచార నడిపిస్తున్నారని సమాచారంతో సిద్దిపేట టాస్క్ ఫోర్స్, వన్ టౌన్ పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో నలుగురి విటులు, ఓ మహిళను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 వేల నగదు, 6 సెల్ ఫోన్స్, ఓ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

News October 4, 2024

MDK: మొదలైన సందడి.. నామినేటెడ్ ఆశలు?

image

మెదక్ జిల్లాలో ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, దేవాదాయ శాఖ, మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ పాలక మండళ్లు ఖాళీగా ఉన్నాయి. మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదర్ రాజనరసింహ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పదవులు భర్తీ గురించి చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో జిల్లాలోని ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

News October 4, 2024

మెదక్: పెరిగిన ధరలు సామాన్యుల ఇక్కట్లు

image

ఉమ్మడి మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా కూరగాయల రేట్లు కొండెకాయి. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా కొనసాగే గ్రామీణ ప్రాంత సంతలో టమాటా కిలో రూ.50 – 80, బీరకాయలు 60 -70, బెండకాయలు 50 – 80, పచ్చి మిర్చి 80 – 100 వరకు ఉంది.