News April 1, 2024

మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు

image

మే 1వ తేదీన నుంచి 31వ తేదీ వరకూ జిల్లాలోని వివిధ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అండర్‌–14 విభాగంలో 25 మంది బాలురు, 25 మంది బాలికలకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శేషగిరి తెలిపారు. ఆసక్తి ఉన్న వివిధ క్రీడల జిల్లా అసోసియేషన్లు, పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయుల, ఫిజికల్‌ డైరెక్టర్లు, సీనియర్‌ క్రీడాకారులు పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలన్నారు.

Similar News

News April 19, 2025

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతి

image

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్ కిరణ్ (20) స్నానానికి వచ్చాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News April 19, 2025

ప్రవీణ్ శరీరంపై 18 గాయాలున్నాయి: హర్షకుమార్

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో పోస్టుమార్టం రిపోర్టు బహిర్గతం చేయడానికి ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ నిలదీశారు.శుక్రవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రవీణ్ కేసులో పోలీసుల దర్యాప్తును తనతో సహా ఎవ్వరూ విశ్వసించడం లేదని వ్యాఖ్యానించారు. తన వద్దకు వచ్చిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం ప్రవీణ్‌పై 18 శరీరంపై గాయాలున్నాయని, ఇది ముమ్మాటికీ హత్యే అని పేర్కొన్నారు.

News April 18, 2025

తూ.గో. జిల్లా ప్రజలకు హెచ్చరిక

image

తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. చెట్ల కింద ఎవరూ ఉండవద్దని హెచ్చరించింది.

error: Content is protected !!