News February 12, 2025

మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి

image

ఘట్‌కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News February 12, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ బర్డ్ ఫ్లూ.. భద్రాద్రి జిల్లా సరిహద్దులు అప్రమత్తం ✓ చర్ల: 30 ఏళ్లుగా ఆ బడికి టీచర్ లేరు ✓ జేఈఈ మెయిన్స్‌లో గుండాల విద్యార్థుల ప్రతిభ ✓ రోడ్డు ప్రమాదంలో అశ్వాపురంలో యువకుడి మృతి ✓ RSS చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను ఖండించిన కూనంనేని ✓ జిల్లాలో శివరాత్రి వేడుకలకు ఆలయాల ముస్తాబు ✓ చర్ల: 6 గ్యారంటీలు అమలు చేయాలి: CPIML న్యూడెమోక్రసీ ✓ మణుగూరులో కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వ్యక్తికి రిమాండ్.

News February 12, 2025

కొత్త 50 రూపాయల నోట్లు

image

ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త రూ.50 నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. ఈమేరకు ఆర్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న చాలా నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతో ప్రింట్ అయ్యాయి. ఆయన స్థానంలో గతేడాది డిసెంబర్‌లో వచ్చిన సంజయ్ పేరుతో కొత్త రూ.50 నోట్లను ముద్రించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

News February 12, 2025

రామగుండం: వారం వ్యవధిలో తనువు చాలించిన భార్యాభర్తలు

image

తనువు ఆ తర్వాత మనువు తో కలిసిన ఆ బంధం కట్టే కాలే వరకు కొనసాగింది. 4 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు తనువు చాలించిన సంఘటన గోదావరిఖనిలో చోటుచేసుకుంది. స్థానిక బాపూజీ నగర్కు చెందిన ఆకునూరి లక్ష్మి ఈనెల 2న మరణించగా 4 రోజుల వ్యవధిలో భర్త ఆకునూరి దుర్గయ్య తనువు చాలించారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన కుటుంబం లో విషాదాన్ని మిగిల్చింది.

error: Content is protected !!