News April 5, 2025
మేడ్చల్: గుండెపోటుతో చనిపోయిన విద్యార్థి ఇతనే

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో మరణించిన విద్యార్థి వివరాలు తెలిశాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ అనే విద్యార్థి, సీఎంఆర్ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలసి క్రికెట్ ఆడుతుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Similar News
News April 7, 2025
రామప్పకు 812 ఏళ్లు.. కీ చైన్ చూశారా?

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం నిర్మించి 812 ఏళ్లు పూర్తైన సందర్భంగా సేవా టూరిజం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రామప్పను ప్రమోట్ చేయడానికి కీ చైన్ విడుదల చేశారు. కీ చైన్ బిల్లపై ఓవైపు రామప్ప ఆలయం, మరోవైపు నాగిని నృత్యం చేస్తున్న చిత్రాన్ని ముద్రించారు. ఈ కీ చైన్ ఎంతో ఆకర్షణయంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం? రామప్పను దర్శించి కీ చైన్ తీసుకోండి.
News April 7, 2025
బిగ్‌బాస్ హోస్ట్‌గా బాలకృష్ణ?

తెలుగు బిగ్‌బాస్ షో హోస్టింగ్ నుంచి కింగ్ నాగార్జున తప్పుకొన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో హోస్ట్‌గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్. ‘అన్‌స్టాపబుల్’ ద్వారా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌కూ బాలయ్య ప్లస్ అవుతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News April 7, 2025
తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నర్సంపేట వాసుల ప్రతిభ

నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిభ కనబర్చారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కోచ్‌లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.