News February 25, 2025
మేడ్చల్: టీచర్లకు కలెక్టర్ కీలక సూచనలు..

పదవ తరగతి తరువాత ఏ దిశగా వెళ్లాలనే అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా మార్గనిర్దేశం చేసి వారి భవిష్యత్తుకు చేయూతనందించేలా అన్ని పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. సోమవారం కూకట్‌పల్లి మండలం ఎల్లమ్మబండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయనతో పాటు సంబంధిత అధికారులు ఉన్నారు.
Similar News
News February 25, 2025
మిర్చి రైతులకు మద్దతు ధర: మంత్రి లోకేశ్

రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం CBN చేసిన ప్రయత్నాలు ఫలించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. సోమవారం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేలా మిర్చి రైతులకు క్వింటా కనీస మద్దతు ధర రూ.11,781లు చెల్లించేందుకు కేంద్రం అంగీకరించిందని మంత్రి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు.
News February 25, 2025
పెదకాకాని మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: నాదెండ్ల

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో జరిగిన విద్యుదాఘాతం ఘటనపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై సోమవారం ఓ ప్రకటనలో మంత్రి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
News February 25, 2025
గర్భిణులు, బాలింతలు జాగ్రత్త!

AP: ‘జనని సురక్ష యోజన’ పథకం ద్వారా సాయం చేస్తామని గర్భిణులు, బాలింతలకు ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు పంపి సైబర్ నేరగాళ్లు డబ్బు కాజేస్తున్నారు. ఇలా కొందరు మోసపోతున్నట్లు బాపట్ల SP తుషార్ డూడీ వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇచ్చారు. కేటుగాళ్లు తొలుత అంగన్వాడీ, ANMల వివరాలు సేకరించి ఆపై బాలింతలు, గర్భిణుల ఫోన్ నంబర్లు రాబడుతున్నారు. వాళ్ల వాట్సాప్ నంబరుకు CM ఫొటో పెట్టుకొని నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.