News April 1, 2025
మేడ్చల్‌లో 33 వేల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో యాసంగి సీజన్లో సాధారణ వరిపంట సాగు విస్తీర్ణం 10,454 ఎకరాలు కాగా, రైతులు 11,015 ఎకరాల్లో వరి పంట వేశారు. వరి దిగుబడి 33 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రైతుల నుంచి పంట మంచి దిగుబడి సాధించడంతో జిల్లాలో మున్ముందు ఆహార ఉత్పత్తిలో వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
Similar News
News April 3, 2025
లక్షణాలు లేకపోయినా ఆస్పత్రి పాలు.. ఓ కంపెనీ CEO పోస్ట్ వైరల్!

ఆస్పత్రిపాలైన ‘డేజీన్ఫో మీడియా’ సీఈవో అమిత్ మిశ్రా చేసిన లింక్డిన్ పోస్ట్ వైరలవుతోంది. ‘ఆఫీస్ వర్క్ చేస్తుండగా ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా బీపీ 230 దాటింది. డాక్టర్లు తీవ్రంగా శ్రమించి BP తగ్గిస్తే మరుసటి రోజు మూర్చపోయా. ఎలాంటి లక్షణాలు లేవు. ఈ అనుభవంతో చెప్తున్నా పని ముఖ్యమే కానీ ఆరోగ్యమూ చూసుకోండి. అందుకే తరచుగా హెల్త్ చెకప్స్ చాలా ముఖ్యం’ అని ఆయన రాసుకొచ్చారు.
News April 3, 2025
MBNR: ‘స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించాలి’

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందని, దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. ఈ బిల్లుకు తాము అసెంబ్లీలో మద్దతు ఇచ్చామని, రేపు పార్లమెంట్‌కు వస్తే, అక్కడ కూడా మద్దతు ఇస్తామన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు.
News April 3, 2025
13న ఓటీటీలోకి ‘కింగ్‌స్టన్’

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ ‘కింగ్‌స్టన్’ మూవీ ఈ నెల 13న జీ5 ఓటీటీలోకి రానుంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు జీ తమిళ్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.