News April 4, 2025
మైదుకూరు : పైపులైన్ పనుల్లో బయటపడ్డ మృతదేహాలు

మైదుకూరు నుంచి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్‌కు నీరు సరఫరా చేసే పైపులైన్ పనుల్లో కాజీపేట రావులపల్లె చెరువులో పాత మృతదేహాలు వెలికితీయడం కలకలం రేపింది. శ్మశానం లేక చెరువులో పూడ్చిన మృతదేహాలు బయటపడడంతో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆరోపించారు. శ్మశానం నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో.. విమర్శిస్తున్నారు.
Similar News
News April 12, 2025
కడప జిల్లా నేతలకు చంద్రబాబు సూచనలు

కడప విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణ ఆకృతుల గోడపత్రాలను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణంలో నాణ్యత లోపం కనిపించకూడదన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉభయ కడప జిల్లా నేతలందరూ కలిసి భూమి పూజ చేయాలని స్పష్టం చేశారు.
News April 12, 2025
కడప జిల్లాకు 21వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో కడప జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 15301 మంది పరీక్షలు రాయగా.. 9295 మంది పాసయ్యారు. 61 శాతం పాస్ పర్సంటేజీతో కడప జిల్లా రాష్ట్రంలోనే 21వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 12878 మందికి, 9688 మంది పాసయ్యారు. 75 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 22వ స్థానంలో కడప జిల్లా నిలిచింది.
News April 12, 2025
కడప: మరికాసేపట్లో ఇంటర్ రిజల్ట్స్

కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్ ఫలితాలు ఇవాళ 11 గంటలకు రానున్నాయి. కడప జిల్లాలో మొత్తం 64 పరీక్షా కేంద్రాల్లో 32,885 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,114 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 15,771 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.