News April 5, 2025
మైలవరంలో ఒకరి ఆత్మహత్య

మైలవరంలో శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కథనం మేరకు.. దేవుని చెరువులో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు భార్య, పిల్లల్ని వదిలేసి ఓ మహిళతో సహజీనవం చేస్తున్నాడు. ఆ మహిళ సాయంత్రం పని నుంచి ఇంటికి వచ్చే సరికి వెంకటేశ్వరరావు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో పోలీసులుకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 6, 2025
VJA: గంజాయిపై ఉక్కు పాదం.. ఇద్దరి అరెస్ట్

గంజాయిపై విజయవాడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చెన్నై వైపు గంజాయి తరలిస్తున్న కారును పటమట పోలీసులు సీజ్ చేశారు. ఈ కారులో నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, చిత్తూరుకు చెందిన షేక్ సాజిద్, షేక్ ఫయాజులను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌కు తరలించామన్నారు.
News April 6, 2025
నేగు మచిలీపట్నంలో శ్రీరామ శోభాయాత్ర

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఈనెల 6వ తేదీన మచిలీపట్నంలో శ్రీరామ శోభా యాత్రను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక హిందూ కాలేజ్ నుంచి కోనేరు సెంటర్ వరకు నిర్వహించే ఈ శోభాయాత్రలో అశేష భక్తజనులు పాల్గొనున్నారు. శోభాయాత్ర కమిటీ ప్రతినిథులు ప్రజా ప్రతినిథులు, అధికారులు, నగర ప్రముఖులను స్వయంగా ఆహ్వానించారు. ఇందులో భాగంగా శనివారం కలెక్టర్ డీకే బాలాజీని కలిసి ఆహ్వానపత్రం అందజేశారు.
News April 5, 2025
మచిలీపట్నం: పీజీ సెట్ కోసం KUలో సమాచార కేంద్రం

పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కోసం కృష్ణా విశ్వవిద్యాలయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా ఎల్. సుశీల తెలిపారు. పీజీ సెట్-2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈనెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.