News February 13, 2025
మొగడంపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మొగడంపల్లి మండలం చిరాగ్‌పల్లి SI రాజేందర్ రెడ్డి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 115 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఆర్టీఏ చెకోపోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకొని స్వాధీనం చేసుకున్నామన్నారు. శివానంద్, వెంకట్, పాండు, ఓనర్ సిద్ధు, డ్రైవర్ సంగమేష్‌లపై కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News February 13, 2025
సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
News February 13, 2025
ప్రభాస్ న్యూ లుక్ అదిరిందిగా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ‘ఫౌజీ’ సినిమాలో తాను నటిస్తున్నట్లు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. డార్లింగ్, డైరెక్టర్‌తో దిగిన ఫొటోలను ఆయన Xలో షేర్ చేశారు. ఇప్పటివరకూ ఈ చిత్రంలోని ప్రభాస్ లుక్ రివీల్ కాలేదు. ఫొటోలో సైడ్ క్రాఫ్ హెయిర్ స్టైల్‌తో ట్రిమ్మ్‌డ్ బియర్డ్‌తో ఫార్మల్ డ్రైస్‌లో డార్లింగ్ కనిపించారు. ప్రభాస్ లుక్ బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.
News February 13, 2025
ఇలాంటి డాక్టర్లు చాలా అరుదు!
వైద్యాన్ని వ్యాపారం చేసిన ఈ రోజుల్లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఎంతో మందికి పునర్జన్మనిచ్చారు వారణాసికి చెందిన డా.తపన్ కుమార్ లాహిరి. 2003లోనే ఆయన రిటైర్ అయినప్పటికీ 83 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవలందిస్తున్నారు. 1994 నుంచి తన జీతం మొత్తాన్ని నిరుపేదల కోసం విరాళంగా ఇచ్చి పెన్షన్‌తో జీవిస్తున్నారు. రోజూ ఉదయం గొడుగు పట్టుకొని నడుస్తూ క్లినిక్‌కు వెళ్తుంటారు. ఆయనను 2016లో పద్మశ్రీ వరించింది.