News February 5, 2025
మోకిల: స్కూల్ బస్సును ఢీకొని IBS విద్యార్థి మృతి
స్కూల్ బస్సును బైక్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు వివరాలు ప్రకారం.. శంకర్‌పల్లి మండల IBS కాలేజీలో Btech చదివే విద్యార్థులు బొడ్డు శ్రీహర్ష (19), హర్ష నందన్ వేదాంతం (19) ఇద్దరు బైక్‌పై కొండకల్ నుంచి మోకిలకు వస్తుండగా ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొని శ్రీహర్ష అక్కడికక్కడే చనిపోయాడు. హర్ష నందన్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 6, 2025
MNCL: ఏఐటీయూసీ కృషితోనే వయోపరిమితి పెంపు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కృషితోనే కారుణ్య నియామకాల ఉద్యోగ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. కార్మికుడు మరణించిన లేదా మెడికల్ ఇన్వాల్యుడేషన్ అయిన వారసుడికి 40 సంవత్సరాల వయసు ఉన్న ఉద్యోగం ఇస్తారని పేర్కొన్నారు.
News February 6, 2025
పెద్దపల్లిలో బాలికల బాలసదనం ప్రారంభం
పెద్దపల్లి జిల్లాలోని అనాథ బాలికలకు ప్రభుత్వం బాల సదనం ప్రారంభించిందని వయోవృద్ధుల శాఖ అధికారి పి.వేణుగోపాలరావు తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు అనాథ బాలికలను అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు. ఉచిత వసతి, విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివించి వివాహం కూడా జరిపిస్తామని తెలిపారు.
News February 6, 2025
అమెరికాలో తెలుగోళ్లు ఎంతమంది ఉన్నారంటే?
అక్రమ వలసదారులను అమెరికా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. అమెరికాలో తెలుగు వారు 12.30 లక్షలకుపైగా ఉన్నారు. ఎక్కువగా కాలిఫోర్నియా(2 లక్షలు)లో నివసిస్తున్నారు. ఆ తర్వాత టెక్సాస్(1.50 లక్షలు), న్యూజెర్సీ(1.10 లక్షలు), ఇల్లినాయిస్(83 వేలు), వర్జీనియా(78 వేలు), జార్జియా(52 వేలు)లో ఉన్నారు. అక్కడ హిందీ, గుజరాతీ మాట్లాడే వారి తర్వాత తెలుగు మాట్లాడేవారే ఎక్కువ.