News March 30, 2024

మోడల్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పొడగింపు: డీఈఓ

image

కర్నూలు జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News February 5, 2025

పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత

image

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్‌ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.

News February 5, 2025

అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పార్థసారథి వినతి

image

దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మంగళవారం కలిసి రైల్వే గేట్ నంబర్ 197 వద్ద రోడ్డు, అండర్ బ్రిడ్జ్ (RUB) నిర్మాణంపై విన్నవించారు. పట్టణంలో ఈ గేటు మూసివేయడంతో మార్కెట్ యార్డ్‌కు వెళ్లాల్సిన రైతులు, కార్మికులు, పాదచారులు అదనంగా 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని కోరారు.

News February 4, 2025

జాతీయ నులిపురుగుల నివారణ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

image

విద్యార్థులందరూ తప్పనిసరిగా నులి పురుగులు నివారించే అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమంలో భాగంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. 1-19 ఏళ్ల లోపు వారందరూ మాత్రలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

error: Content is protected !!