News March 28, 2025
మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

సూర్యలంక సముద్ర తీర అభివృద్ధికి రూ.97 కోట్లు మంజూరు కావడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చిత్రపటాలకు సూర్యలంక సముద్రతీరం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. బాపట్లలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Similar News
News April 2, 2025
సంగారెడ్డిలో 79,987.81 క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా: కలెక్టర్

సంగారాడ్డి జిల్లాలోని 846 రేషన్ దుకాణాల ద్వారా 79,987.81 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 3,78,728 రేషన్ కార్డులు ఉన్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
News April 2, 2025
NGKL: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. దుండగులను శిక్షించాలని డిమాండ్

నాగర్ కర్నూల్ జిల్లాలో ఊరుకొండ ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు పరుశురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులు కావద్దని వారన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు.
News April 2, 2025
వనపర్తి జిల్లాలో 1,59,353 రేషన్ కార్డులు: అదనపు కలెక్టర్

వనపర్తి జిల్లా వ్యాప్తంగా 1,59,353 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 5,22,367 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వెల్లడించారు. రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యం ఉచితంగా ఇవ్వనున్నామన్నారు. దీనికోసం జిల్లాలో 3,309 మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యం అవసరమన్నారు. జిల్లాలోని 324 చౌక ధర దుకాణాల్లో సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.