News March 20, 2025

మోదీని కలిసిన ఎంపీ కుటుంబ సభ్యులు

image

ప్రధాని మోదీని ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కుటుంబ సభ్యులు కలిశారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మనుమరాళ్లతో ప్రధానమంత్రి కాసేపు గడిపారు. మెదక్ ఎంపీ దంపతులు, అల్లుడు కూతురు, మనమరాళ్లతో కలిసి ప్రధానమంత్రి కలిసి శాలువా కప్పి సన్మానించారు.

Similar News

News March 28, 2025

ఎలిగేడు: బాలుడి హత్య

image

బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో జరిగింది. సాయికుమార్ (17) అనే బాలుడిని కత్తితో పొడిచి చంపిన దుండగుడు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆరోపిస్తున్న మృతుడి బంధువులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

‘మ్యాడ్ స్క్వేర్’ పబ్లిక్ టాక్

image

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ థియేటర్లలో విడుదలైంది. సినిమాలో డైలాగ్స్, కామెడీ బాగున్నాయని, లడ్డూ క్యారెక్టర్ విపరీతంగా నవ్విస్తుందని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు. యూత్ ఆడియన్స్‌కు నచ్చే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని, స్పెషల్ సాంగ్ బాగుందని అంటున్నారు. అక్కడక్కడ సాగదీతగా, బోరింగ్ ఫీల్ కలుగుతుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ

News March 28, 2025

హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

image

రంజాన్ చివరి శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా రానుండటంతో పోలీసులు HYDలో ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉ.8 నుంచి సా.4వరకు మూసేస్తున్నారు. చార్మినార్‌కు వచ్చే నయాపూల్ నుంచి మదీనా, శాలిబండ- హిమ్మత్‌పుర, చౌక్‌మైదాన్-మొగల్‌పుర, మీర్ఆలం మండీ/బీబీ బజార్, మూసాబౌలి- మోతీహాల్, గన్సీబజార్- హైకోర్టు రోడ్డుకు వాహనాలు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!