News February 5, 2025

మోరిలో సత్రానికి 116 ఏళ్లు..! 

image

సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలోని వీరభద్రయ్య అన్నదాన సత్రానికి 116 ఏళ్లు పూర్తయ్యాయి. ఏటా అంతర్వేది తీర్థానికి వచ్చే యాత్రికులకు అష్టమి, నవమి, దశమి తిథుల్లో మోరి వద్ద జాన శంకరయ్య కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. తీర్థం రోజున అంతర్వేదిలోనూ భోజనాలు అందిస్తున్నారు. పూర్వం నడిచి వెళ్లే భక్తులకు ఈ సత్రమే ఆశ్రయం ఇచ్చేదని గ్రామస్థులు చెబుతున్నారు.

Similar News

News February 6, 2025

దరఖాస్తు గడువు పెంపు

image

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.

News February 6, 2025

MNCL: ఏఐటీయూసీ కృషితోనే వయోపరిమితి పెంపు

image

సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కృషితోనే కారుణ్య నియామకాల ఉద్యోగ వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతూ యజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ తెలిపారు. కార్మికుడు మరణించిన లేదా మెడికల్ ఇన్వాల్యుడేషన్ అయిన వారసుడికి 40 సంవత్సరాల వయసు ఉన్న ఉద్యోగం ఇస్తారని పేర్కొన్నారు.

News February 6, 2025

పెద్దపల్లిలో బాలికల బాలసదనం ప్రారంభం

image

పెద్దపల్లి జిల్లాలోని అనాథ బాలికలకు ప్రభుత్వం బాల సదనం ప్రారంభించిందని వయోవృద్ధుల శాఖ అధికారి పి.వేణుగోపాలరావు తెలిపారు. 6 నుంచి 18 సంవత్సరాల వయస్సులోపు అనాథ బాలికలను అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు. ఉచిత వసతి, విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదివించి వివాహం కూడా జరిపిస్తామని తెలిపారు.

error: Content is protected !!