News May 21, 2024

మోసపోయిన 11 మంది పాలమూరు న్యాయవాదులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. అయితే వీరు ముందస్తుగా ఆన్‌లైన్లో టికెట్లు బుక్ చేయించుకున్నారు. పవన్ హాండ్స్ అనే సంస్థ ద్వారా రూ.5,500 చెల్లించి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకుని పాట్నాలో దిగారు. తీరా పాట్నాలో టికెట్లు ఫేక్ టికెట్లు‌గా అధికారులు చెప్పడంతో వీరంతా తమకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తి ప్రశ్నించారు.

Similar News

News October 3, 2024

జూరాల గేట్లు మూసివేత

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్ ఫ్లో బుధవారం రాత్రి 9 గంటలకు 55,800 క్యూసెక్కులకు తగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లను ఉదయం ముసివేసినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 41,039 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీ ప్రస్తుతం ప్రాజెక్టులో 9.418 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News October 3, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

☞ఉపాధిపై యువత పోరాడాలి:సీఐటీయూ
☞Way2Newsతో డప్పు కళాకారులు
☞రేపు వర్షాలు:వాతావరణ శాఖ
☞ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా రవి
☞SGT అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
☞కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
☞కోస్గిలో రేపటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలు
☞DSCలో సత్తా చాటిన వారికి ఘన సన్మానం
☞దసరా సెలవులకు ఊరెళ్తూన్నారా.? అయితే జాగ్రత్త:SIలు
☞ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

News October 2, 2024

MBNR: ‘డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలి’

image

డిజిటల్ కార్డు సర్వే బృందాలు కుటుంబ వివరాలను పక్కాగా నిర్వహించాలని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. డిజిటల్ కార్డు సర్వే బృందాలకు కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎంపిక చేసిన గ్రామ, వార్డులలో ఈనెల 3నుంచి 7 వరకు సర్వే నిర్వహించాలని ఆమె సూచించారు. సర్వే బృందాలకు MRO, MPDO, మున్సిపల్ కమిషనర్‌లు టీం లీడర్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు.