News February 18, 2025

యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

image

యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రూ.5 కోట్ల విలువైన స్థలం విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై తహశీల్దార్ బాల కిషోర్‌ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వీఆర్వో యల్లయ్య, సర్వేయర్ దిలీప్‌లను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ నలగాటి మల్లికార్జున మంగళవారం తెలిపారు.

Similar News

News February 22, 2025

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్

image

☛ కించపరిచే పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ ☛ శ్రీశైలం యాత్రకు 24 గంటలు అనుమతి ☛ ఇంటర్ విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్: కలెక్టర్ ☛ ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించాలి: జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ☛ భర్త పురుగు మందు తాగాడని పోలీసులకు ఫోన్☛ గ్రూప్ – 2 పరీక్షలకు ఏడు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్ ☛ చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం ☛ గ్రూప్-2 మెయిన్స్ వ్రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

News February 21, 2025

చీమకుర్తిలో క్షుద్ర పూజల కలకలం

image

చీమకుర్తి మండలంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఏలూరివారి పాలెం – కూనంనేనివారి పాలెం గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయాన్నే పనులకు వెళ్తున్న వారికి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, పెద్ద ముగ్గు, మట్టి కుండలు దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 21, 2025

గ్రూప్-2 పరీక్షలకు 7 కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

image

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల కోసం జిల్లాలో 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అన్సారియా తెలిపారు. 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షలకు 4,544 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారని, ఏవైనా సందేహాలు ఉంటే 8801188046 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

error: Content is protected !!