News February 16, 2025
యలమంచిలి: 45 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ పట్టివేత

యలమంచిలి మండలంలో చించినాడ హైవే వద్ద శనివారం నరసాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లాకి మినీ లారీలో తరలిస్తున్న 45 క్వింటాళ్ల పీడీఎస్ రైసును విజిలెన్స్ సీఐ డి. ప్రసాద్ కుమార్ పట్టుకున్నారు. మినీ లారీని, బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యలమంచిలి సివిల్ సప్లై డీటీ అయితం సత్యనారాయణ ఉన్నారు.
Similar News
News March 15, 2025
పెంటపాడు: ఐరన్ ప్లేట్ మీద పడి వ్యక్తి మృతి

బరువైన ఐరన్ ప్లేట్ మీద పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ప్రత్తిపాడులో జరిగింది. ఎస్సై స్వామి తెలిపిన వివరాల మేరకు.. తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్(38) ఈ నెల 13న ప్రత్తిపాడులోని ఓ పేపర్ మిల్లులో ఇనుప వస్తువులు తొలగించే పని మీద వెళ్లాడు. ఆ సమయంలో మస్తాన్‌పై బరువైన ఇనుప ప్లేట్ పడటంతో మృతి చెందాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు విషయం ఎవరికీ తెలియరాలేదు.
News March 15, 2025
ప.గో: నెత్తురోడిన రహదారులు.. ఐదుగురు మృతి

శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న లారీని ఢీకొట్టగా చిన్నారితో సహా తల్లిదండ్రులు <<15760017>>మృతి చెందారు.<<>> కృష్ణా(D) ఘంటలసాల(M) జీలగలగండిలోని హైవేపై <<15755822>>లారీని బోలెరో ఢీకొన్న<<>> ఘటనలో ప్రాతాళ్లమెరకకు చెందిన వర ప్రసాద్, శివకృష్ణ చనిపోయారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
News March 14, 2025
పాలకొల్లులో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

రాష్ట్రంలో రెండు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే మంజూరు కాగా, అందులో ఒకటి, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పాలకొల్లులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి అనగాని సత్య కుమార్ యాదవ్, జలవనరుల శాఖ మంత్రి ప్రారంభించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.