News March 11, 2025

యాంటీ-నార్కోటిక్ బ్యూరోగా రూపేశ్ బాధ్యతల స్వీకరణ

image

తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో కొత్త ఎస్పీగా రూపేశ్, ఐపీఎస్, సోమవారం HYDలో బాధ్యతలు స్వీకరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, రూపేశ్ నేతృత్వంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యాచరణ కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు.

Similar News

News March 12, 2025

HYD: అమ్మా..నాన్నా.. మేం చనిపోతున్నాం! (లెటర్)

image

హబ్సిగూడ‌లో ఆత్మహత్య చేసుకున్న దంపతుల సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘అమ్మా.. నాన్న.. మీకు భారంగా ఉండలేక చనిపోతున్నాం. మీరు బాధపడకండి. అన్నా వదిన మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. నా వల్ల ఎప్పుడు మీకు బాధలే. ఏడవకు అమ్మ, నేను నిన్ను వదిలి వెళ్లిపోయా. ఈ బాధ కొద్ది రోజులే, నాకు జీవించాలని అనిపించడం లేదు. నా వరకు ఈ నిర్ణయం కరెక్టే’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

News March 12, 2025

HYD: భగ్గుమంటున్న ఎండ.. రెండ్రోజులు జాగ్రత్త!

image

ఉమ్మడి RR. HYD వ్యాప్తంగా ఎండ భగ్గుమంటోంది. గత 24 గంటల్లో మూసాపేటలో గరిష్ఠంగా 36.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగోల్, బాలానగర్‌లో 36 డిగ్రీలు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో మార్చి 13, 14 తారీఖుల్లో 37- 39 డిగ్రీలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలంది.

News March 12, 2025

HYD: అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత

image

తెలంగాణ అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బషీర్‌బాగ్, నాంపల్లి, రవీంద్రభారతి పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రగతిపై గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు.

error: Content is protected !!