News September 13, 2024

యాత్రికుల రక్షణకు చర్యలు ప్రారంభించాం: మంత్రి లోకేశ్

image

కేదార్ నాథ్‍లో చిక్కుకున్న 18 మంది తెలుగు యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శుక్రవారం, మంత్రి మాట్లాడుతూ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, ఈ లోగా యాత్రికులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సహకారాన్ని కోరామన్నారు. యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలన్నారు.

Similar News

News March 13, 2025

GNT: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

image

గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊరట దక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఓబులాపురం మైనింగ్‌పై గతంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలకు సంబంధించిన కేసును గురువారం విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొన్న అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప, ధూళిపాళ్ల, జనార్దన్ రెడ్డి సహా పలువురు నేతలు ఈ కేసు నుంచి విముక్తి పొందారు.

News March 13, 2025

గుంటూరులో ఫైనాన్స్ కంపెనీ భారీ మోసం

image

ఐదున్నర కిలోల బంగారం తాకట్టు పెడితే కేవలం వెయ్యి గ్రాములే అని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు పత్రాలు సృష్టించి ఓ వైద్యురాలిని మోసం చేశారు. పోలీసుల కథనం మేరకు.. ముత్యాలరెడ్డి నగర్‌కి చెందిన ఓ వైద్యురాలు అరండల్‌పేటలోని ఓ ప్రయివేట్ ఫైనాన్స్‌ కంపెనీలో ఐదున్నర కిలోల బంగారాన్ని తాకట్టు పెట్టారు. సంస్థలో పనిచేసే ఐదుగురు సిండికేట్‌గా ఏర్పడి నాలుగున్నర కేజీల బంగారాన్ని తప్పుడు పత్రాలతో కాజేశారు.

News March 13, 2025

గుంటూరు కమిషనర్ ఆదేశాలు

image

GMCకి ఆస్తి పన్ను చెల్లించని మొండి బకాయిదార్లు గృహాల, వ్యాపార సంస్థల ట్యాప్ కనెక్షన్‌లు తొలగించుట, ఆస్తులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం సీజ్ చేయాలన్నారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆస్తి పన్ను వసూళ్ళ పై రెవిన్యూ విభాగం, విభాగాధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ.. గుంటూరులో 3 ఏళ్ల కు పైగా ఆస్తి పన్ను బకాయి ఉన్న వారి నివాసాలకు సీజు చేయమని ఆదేశించారు.

error: Content is protected !!