News March 10, 2025
యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.
Similar News
News March 10, 2025
PDPL: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణ రాయితీ: ఎ.కీర్తి కాంత్

రుణ రాయితీతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని పెద్దపల్లి జిల్లా పరిశ్రమల అధికారి ఎ.కీర్తి కాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆహార శుద్ధి సంస్థ ఆదేశాలకు ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ స్కీం లో భాగంగా 35 శాతం రుణ రాయితీ రుణాల మంజూరు కోసం మార్చి12 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు.
News March 10, 2025
పెద్దపల్లి: 10వ తరగతి పరీక్షల నిర్వహణపై DEO సమీక్ష

10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ సీ విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, DEO మాధవి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో తెలిపారు. మార్చి 21నుంచి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షల నిర్వహించాలన్నారు. జిల్లాలో పరీక్షల కోసం 41 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు.
News March 10, 2025
వరంగల్: సింగల్ పట్టి మిర్చి రూ. 39వేలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి సోమవారం అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.17వేలు పలకగా,1048 రకం మిర్చి రూ.11వేలు, 5531 రకం మిర్చికి రూ. 11,300 ధర వచ్చింది. అలాగే ఎల్లో మిర్చికి రూ.20 వేలు, టమాటా మిర్చికి రూ.28వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.39వేల ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.