News March 9, 2025
యాదాద్రి: అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పేరు ప్రకటించడంపై ఆయన అభిమానులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 10, 2025
గార: సముద్ర స్నానాల్లో అపశ్రుతి

గార మండలంలోని చిన్నవత్సవలస రాజమ్మ తల్లి జాతర సముద్ర స్నానాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జి. సిగడాం మండలం దేవరవలసకు చెందిన తండ్రీ, కొడుకులు కొడమటి ఈశ్వరరావు, అశోక్(23) సముద్ర స్నానానికి వెళ్లగా అలల తాకిడికి గల్లంతయ్యారు. తోటివారు కేకలు వేయడంతో మెరైన్ పోలీసులు స్పందించి, తండ్రి ఈశ్వరరావును ఒడ్డుకు తీసుకొచ్చారు. అశోక్ ఆచూకీ దొరకలేదు. ఎస్ఐ జనార్దన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2025
భారత్ విక్టరీపై కేంద్రమంత్రి బండి ట్వీట్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కప్ సాధించిన టీమ్ ఇండియాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. టీమ్ఇండియా..అన్ స్టాపేబుల్, అన్ బీటబుల్, అన్ ఫర్గటబుల్.. కంగ్రాట్యులేషన్స్ టు ది మెన్ ఇన్ బ్లూ..ఫర్ మేకింగ్ ది నేషన్ ప్రౌడ్ అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. భారత జట్టు ఛాంపియన్స్‌గా ఆవిర్భవించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
News March 10, 2025
పిఠాపురం: ఎమ్మెల్సీ రాకపోవడంతో వర్మ అసహనం?

ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరులు దగ్గర వాపోయిన మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంతకుమించి తాను ఇక ఏమీ మాట్లాడలేనని అమరావతి నుంచి కారులో పిఠాపురం బయలుదేరారు.