News March 15, 2025
యాదాద్రి: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తిమ్మాపూర్‌కు చెందిన చామల రమేశ్‌గా గుర్తించారు.
Similar News
News March 15, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ హీరో శ్రీకాంత్

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని శనివారం ప్రముఖ సినీ హీరో శ్రీకాంత్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శేషు తదితరులున్నారు.
News March 15, 2025
అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో?: డీఎంకే

తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన AP Dy.CM పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు DMK కౌంటరిచ్చింది. త్రిభాషా విధానాన్ని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ పార్టీ నేత సయీద్ హఫీజుల్లా అన్నారు. ‘కేంద్రం మాపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. TN ద్విభాషా విధానాన్ని పాటిస్తోంది, దీనిపై బిల్లు చేసి 1968లోనే మా అసెంబ్లీ పాస్ చేసింది. అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో’ అని సెటైర్ వేశారు.
News March 15, 2025
కొడుతూ పోలీసులు టార్చర్ చేస్తున్నారు: నటి

కస్టడీలో తనపై భౌతిక దాడి జరుగుతోందని నటి రన్యారావు ఆరోపించారు. పోలీసులు పలుమార్లు తనను కొట్టారని, ఆహారం ఇవ్వడం లేదని ఆమె జైలు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. తెల్ల కాగితాలపై సైన్ చేయాల్సిందిగా DRI అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తనకేమీ తెలియదని, తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె అరెస్టవ్వడం తెలిసిందే. CBI, ED సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.