News April 4, 2025
యాదాద్రి: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.150 నుంచి రూ.180 మధ్యే ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.250 నుంచి రూ.280 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో పాటు రంజాన్ పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరగడం, వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తుంది.
Similar News
News April 7, 2025
HNK: 9 నుంచి ప్రాక్టికల్ తరగతులు

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు డిగ్రీ బీఎస్సీ, ఎంఎస్సీ, సీఎస్ కోర్సుల మొదటి సంవత్సరం సెమిస్టర్ ప్రాక్టికల్ తరగతులు జరుగుతాయని దూరవిద్య సంచాలకులు ఆచార్య సురేష్ లాల్, సహాయ సంచాలకులు వెంకట్ గోపీనాథ్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 7, 2025
HCU నుంచి బందోబస్తు ఉపసంహరణ

TG: HCU వీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేఖ రాశారు. పౌర సంఘాలు, ఉపాధ్యాయ జేఏసీ విజ్ఞప్తితో క్యాంపస్ నుంచి పోలీస్ బందోబస్తు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అక్కడ ఎలాంటి గొడవలు లేకుండా స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. కాగా విద్యార్థులపై కేసులను వెనక్కి తీసుకుంటామని ఇప్పటికే భట్టి ప్రకటించిన విషయం తెలిసిందే.
News April 7, 2025
NLG: యాక్సిడెంట్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి డ్రైవర్ మృతి

నిడమనూరు మండలం గుంటిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కారు డ్రైవర్ నరసింహగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.