News February 24, 2025
యాదాద్రి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నల్గొండ – వరంగల్ – ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News February 24, 2025
50 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు

TG: SLBC టన్నెల్ ఘటనలో 8 మంది చిక్కుకొని 50 గంటలు దాటింది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. బురదలో ఉన్న వ్యక్తులను గుర్తించే అత్యాధునిక పరికరాలతో గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌లో సేఫ్ కంటైనర్‌లోకి కార్మికులు వెళ్లుంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.
News February 24, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారి దర్శనమిస్తుంది. దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతరకు ముందు వచ్చే సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తుంది.
News February 24, 2025
సిరిసిల్ల: వ్యక్తిపై కేసు నమోదు: ఎస్పీ

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. వేములవాడ దేవాలయానికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసిన నూనె ముంతల రవీందర్ గౌడ్ (43) పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.