News March 24, 2025

యాదాద్రి: రూ.20 లక్షల స్కాలర్ షిప్

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి ఇన్‌ఛార్జి అధికారి వసంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ అందుతుందన్నారు.

Similar News

News March 26, 2025

SLBCలో 33వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు

image

శ్రీశైలం ఎడమగట్టు పరిధి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రబాద్‌లోని SLBC టన్నెల్‌లో గల్లంతైన వారికోసం సహాయక చర్యలు మరింత ముమ్మరం చేశారు. బుధవారం 33వ రోజు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 8మంది గల్లంతు కాగా వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే.మరో ఆరుగురి కోసం సహాయక చర్యలను చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

News March 26, 2025

నాకు టీబీ జబ్బు ఉండేది: సీనియర్ నటి

image

తనకు టీబీ జబ్బు ఉందని, కానీ దీనిని సీక్రెట్‌గా ఉంచానని నటి సుహాసిని తెలిపారు. ఎవరికైనా తెలిస్తే పరువు పోతుందనే భయంతో రహస్యంగా 6 నెలలపాటు చికిత్స తీసుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘నేను 2సార్లు (6,36 ఏళ్లు) TBతో బాధపడ్డా. ఆ సమయంలో విపరీతంగా బరువు తగ్గి, వినికిడి శక్తి కూడా కోల్పోయా. ఆ తర్వాత దాని నుంచి కోలుకున్నా. ప్రస్తుతం TBపై ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు.

News March 26, 2025

కృష్ణా: పొట్టిపాడు టోల్ గేట్ వద్ద గంజాయి పట్టివేత 

image

ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అనకాపల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్న కారును తనిఖీ చేయగా, 62 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో భాస్కర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 

error: Content is protected !!