News March 23, 2025
యానాం సబ్ జైలు గోడదూకి పరారైన ఖైదీ

కేంద్రపాలిత ప్రాంతమైన యానాం సబ్ జైల్ నుంచి గోడ దూకి ఓ ఖైదీ పరారయ్యాడు. సుమారు 25 అడుగులు సబ్ జైల్ గోడ పైనుంచి దూకి శనివారం పరారైనట్లు సమాచారం. ఒక దొంగతనం కేసులో శనివారం ఉదయం 7 రోజులు రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్లిన కనకాల పేటకు చెందిన కనకాల వెంకటేశ్వర్లు మధ్యాహ్నానికి పరారయ్యాడని చెబుతున్నారు. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News March 26, 2025
ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు అధికారం ఇచ్చారు: భట్టి

TG: ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. అలాంటి ధరణిని బంగాళాఖాతంలో వేయాలనే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అందుకే దాన్ని బంగాళాఖాతంలో వేసి, భూభారతి తెచ్చామని పేర్కొన్నారు. అనేక చట్టాలు, పోరాటాల ద్వారా వచ్చిన భూహక్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని భట్టి మండిపడ్డారు.
News March 26, 2025
గంభీర్.. ద్రవిడ్‌ని అనుసరించాలి కదా?: గవాస్కర్

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం టీమ్ ఇండియాకు BCCI రూ.58కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. గంభీర్‌కు రూ.3కోట్లు, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.50లక్షలు లభించనున్నాయి. దానిపై గవాస్కర్ ప్రశ్నించారు. ‘T20 వరల్డ్ కప్ విజయం అనంతరం ద్రవిడ్ బోర్డు ఇచ్చిన డబ్బును తిరస్కరించారు. సిబ్బందితో సమానంగా ఇవ్వాలని కోరారు. కానీ ఇప్పుడు గంభీర్ మాత్రం ఏమీ మాట్లాడలేదు. ద్రవిడ్‌ను అనుసరించాలి కదా?’ అని ప్రశ్నించారు.
News March 26, 2025
ఈ మార్పులు కనిపిస్తే కళ్లజోడు మార్చాల్సిందే!

ఒకటే కళ్లజోడును ఎక్కువ రోజులు వాడొద్దని, ఏడాది లేదా రెండేళ్లకోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ సంకేతాలేమైనా కనిపిస్తే కళ్లద్దాలను మార్చుకోవాలని చెబుతున్నారు.
1. డ్రైవింగ్‌లో సిగ్నల్స్ కనిపించకపోవడం, దగ్గరకు వెళ్లేవరకూ చదవలేకపోవడం 2. పుస్తకాలు చదవడం, మొబైల్ చూడటం కష్టంగా అనిపించడం 3. ఒకటి లేదా రెండు కళ్లల్లోని దృష్టిలో మార్పు కనబడటం వంటివి కనిపించినప్పుడు అద్దాలు మార్చాలి.