News March 20, 2025

యువకుడి ప్రాణం తీసిన బెట్టింగ్

image

బెట్టింగ్ ఊబిలో పడి అప్పు మీద అప్పు చేసి, తీర్చేందుకు స్తోమత లేక.. చివరికి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొలిమిగుండ్ల మండలం గోర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర(28) గుత్తి రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మహేంద్ర గతంలో వాలంటీర్‌గా పనిచేసి, ప్రస్తుతం పెన్నా సిమెంట్‌లో పనిచేస్తున్నాడు.

Similar News

News March 21, 2025

మా జిల్లాలో రోడ్లు లేవని పిల్లనివ్వట్లే: స్పీకర్

image

TG: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రమంతా రోడ్లు వేశామని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పడంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పందించారు. తమ వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు రోడ్ల పరిస్థితిపై రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్ రావును మంత్రి కోమటి రెడ్డి ప్రశ్నించారు. మంత్రి విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.

News March 21, 2025

విమానంలో విషాదం: గాల్లోనే పైలోకాలకు..

image

ఎయిర్ఇండియా విమానంలో విషాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే ప్యాసింజర్ అసీఫుల్లా అన్సారీ మృతి చెందారు. దీంతో ఢిల్లీ నుంచి బయల్దేరిన ఫ్లయిట్‌ను గమ్యస్థానంలో కాకుండా లక్నోలో ల్యాండింగ్ చేశారు. సీటుబెల్ట్ పెట్టుకొని చాలాసేపు కళ్లుమూసుకొని కదలకుండా కూర్చోవడంతో సిబ్బంది ఆయన్ను నిద్రలేపేందుకు ప్రయత్నించారు. లేవకపోవడంతో డాక్టర్లను పిలిచారు. ఆయన జర్నీలోనే చనిపోయారని వారు ధ్రువీకరించారు.

News March 21, 2025

గద్వాల: తల్లిదండ్రుల వేధింపులు.. కొడుకు ఆత్మహత్యాయత్నం

image

తల్లిదండ్రుల వేధిస్తుండటంతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ధరూర్ మం. అల్వాల్‌పాడుకు చెందిన గోవర్ధన్‌ను తన తల్లిదండ్రులు వరకట్న విషయమై వేధిస్తుండేవారని తెలుస్తోంది. గోవర్ధన్‌కి రావాల్సిన భాగం ఇవ్వమని, తన భార్యను సైతం వేధిస్తున్నారనే మనస్తాపంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

error: Content is protected !!