News February 22, 2025
యువకుడిపై కత్తితో ట్రాన్స్‌జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.
Similar News
News February 23, 2025
విజయానికి స్ఫూర్తి క్రీడలే: ఖమ్మం కలెక్టర్

ఓటమి అంచు వరకు వెళ్లి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే చివరికి విజయం సాధించవచ్చనే స్ఫూర్తి మనకు టెన్నిస్ క్రీడా ఇస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను శనివారం కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు. టెన్నిస్ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు.
News February 23, 2025
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు: సీపీ

కామేపల్లి: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. లింగాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించి కేసులు నమోదు చేయాలన్నారు.
News February 22, 2025
ఖమ్మంలో పుష్ప నటుడు జగదీశ్ (కేశవ) సందడి

ఖమ్మంలో శనివారం పుష్ప మూవీ నటుడు జగదీశ్ (కేశవ) సందడి చేశారు. బోనకల్ క్రాస్ రోడ్లో ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. నటుడు జగదీశ్ ‘తగ్గేదేలే’ అంటూ అభిమానులను అలరించారు.