News March 23, 2025
యువత బెట్టింగ్‌లకు పాల్పడవద్దు: సీఐ వాసంతి

యువకులు బెట్టింగ్‌లకు పాల్పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని జీడి నెల్లూరు సీఐ శ్రీనివాసంతి శనివారం తెలిపారు. ఐపీఎల్ మోజులో పడి యువకులు బానిసలు కాకూడదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. బెట్టింగ్ గురించి సమాచారం ఉంటే తమకు ఇవ్వాలని ఆమె కోరారు.
Similar News
News March 28, 2025
చిత్తూరు: ఖాళీ స్థానాలకు ఎన్నికలు

చిత్తూరు జిల్లాలో మండల పరిషత్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. సదుం ఎంపీపీగా మాధవి, పెనుమూరు కో-ఆప్షన్ సభ్యురాలిగా నసీమా, రామకుప్పం ఎంపీపీగా సులోచనమ్మ, వైఎస్ ఎంపీపీగా వెంకటే గౌడ, విజయపురం వైస్ ఎంపీపీగా కన్నెమ్మ, తవణంపల్లి ఎంపీపీగా ప్రతాప్ సుందర్ ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
News March 27, 2025

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడేనా..?

మద్యం కేసులో MP మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జోరుగుతోంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టుకు సైతం వెళ్లారు. ఈక్రమంలో ఆయన లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏప్రిల్ 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత చికిత్స పొందుతున్న తన తండ్రి పెద్దిరెడ్డిని పరామర్శించడానికి వెళ్తారు’ అని ఆయన చెప్పారు. ఆ వెంటనే MPని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన నెలకొంది.