News March 1, 2025
రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న వేళ.. రోడ్లపై గస్తీ పెంచండి: సీపీ

రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న వేళ పోలీసులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ చేసే సమయాన్ని పెంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను అదేశించారు. ప్రధానంగా విజుబుల్ పోలిసింగ్‌లో భాగంగా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. ఫిర్యాదుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తక్షణమే స్టేషన్ అధికారులు స్పందించడంతో పాటు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.
Similar News
News December 14, 2025
ప్రకాశం: గ్యాస్‌పై ఎక్కువ వసూలు చేస్తే.. నోటీసులే.!

సిలిండర్ డెలివరీకి అధికంగా పైసలు వసూలు చేస్తే IVRSకు పట్టుబడే పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. ప్రభుత్వం తమ సేవల గురించి ప్రతి వినియోగదారుడికి ఐవీఆర్ఎస్ కాల్ చేస్తుంది. ఈ విధంగానే గ్యాస్ వినియోగదారులకు కూడా కాల్స్ ద్వారా డెలివరీ సమయంలో ఇబ్బందులపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. వినియోగదారులు నేరుగా పలు గ్యాస్ ఏజెన్సీలపై ఫిర్యాదులు చేయవచ్చు. ఈ మధ్యకాలంలో దీనిపై ఆ ఏజెన్సీలకు అధికారులు నోటీసులిచ్చారు.
News December 14, 2025
మెదక్ : పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

మెదక్ జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రాజ్‌పల్లి, చిన్న శంకరంపేట్, నార్సింగి, పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తూ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News December 14, 2025
Way2News కథనానికి స్పందన.. ఎంజీఎంకు డీఎంఈ

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకల కలకలంపై <<18555211>>Way2Newsలో<<>> వచ్చిన కథనాలపై డీఎంఈ నరేంద్ర కుమార్ స్పందించారు. మధ్యాహ్నం ఎంజీఎం ఆసుపత్రిలో తనిఖీలు చేయనున్నారు. శానిటేషన్ సమస్యపై ప్రచురించిన వరుస కథనాలు ఆరోగ్యశాఖను కుదిపేశాయి. ప్రభుత్వం కూడా సీరియస్ కావడంతో ఆగమేఘాల మీద డీఎంఈ ఎంజీఎంకు బయల్దేరినట్లు సమాచారం.


