News March 12, 2025

రంప: పోలీసు స్టేషన్‌లకు చేరిన క్వశ్చన్ పేపర్స్

image

అల్లూరి జిల్లాలో పదో తరగతి పరీక్ష పత్రాలను పరీక్ష కేంద్రాలు సమీపంలో ఉన్న పోలీస్టేషన్‌లలో భద్రపరిచామని ఏజెన్సీ DEO.మల్లేశ్వరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 71 కేంద్రాలకు 11,766 మంది విద్యార్థులకు సరిపడే సెట్ నంబర్ 1ప్రశ్న పత్రాలు పూర్తి స్థాయిలో జిల్లాకు చేరాయని తెలిపారు. రంపచోడవరం, చింతూరు డివిజన్‌లలో 28పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా పాడేరు డివిజన్ లో 43కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News March 13, 2025

మెదక్‌లో మహిళలు మిస్..

image

మెదక్ పట్టణంలో ఇద్దరు మహిళలు తప్పిపోయారు. వీరిలో… పాపన్నపేట్ మండలం ఎంకేపల్లి చెందిన కందెం నర్సమ్మ (50) ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అలాగే మెదక్ పట్టణానికి చెందిన నీరుడి కిష్టమ్మ (68) అదృశ్యమైంది. ఆమె మతిస్థిమితం సరిగ్గా లేదని తెలిపారు. ఇరువురు కుటుంబ సభ్యులు మెదక్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పైన తప్పిపోయిన వారి ఆచూకీ లభిస్తే మెదక్ టౌన్ పీఎస్‌లో తెలపాలని ఇన్స్పెక్టర్ నాగరాజు సూచించారు.

News March 13, 2025

సిద్దిపేట: ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 విద్యాసంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన ఖాళీ సీట్లు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 లోపు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. నియమ నిబంధనలకు లోబడి రిజర్వేషన్ల పద్ధతిలో విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.

News March 13, 2025

నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో నేటి నుంచి 18 వరకు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, గద్వాల్, నారాయణ్ పేట్ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.

error: Content is protected !!