News February 4, 2025

రఘునాథపాలెం: వివాహితతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

image

రఘునాథపాలెం మండలంలోని శివాయిగూడెంలో ఓ వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. చింతకాని మండలం కోమట్లగూడెంకు చెందిన కొందరు శివాయిగూడెంలో పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వచ్చారు. అందులోని ఓ వివాహితతో నాగేశ్వరరావు అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News February 4, 2025

బోనకల్‌లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు

image

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు. 

News February 4, 2025

పతనమవుతున్న ఎర్ర బంగారం ధర

image

ఖమ్మం మార్కెట్‌లో ఎర్ర బంగారం (తేజ రకం) ధర రోజురోజుకూ పతనమవుతుంది. గత ఏడాది రూ. 23 వేలు పలకగా.. ప్రస్తుతం రూ. 14 వేలకు పడిపోయింది. చైనా దేశంతో పాటు కర్ణాటకలో పండిన పంట వల్ల ఇక్కడి ధరలపై ప్రభావం పడుతోంది. గతేడాది పంట నిల్వ చేసి నష్టపోయిన వ్యాపారులు ప్రస్తుతం మిరపను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. ధరలు భారీగా తగ్గడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

News February 4, 2025

 రెండు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి

image

కల్లూరు మండల పరిధిలోని లింగాల గ్రామ మాజీసర్పంచ్ మట్టూరి సీతారత్నం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఈమె భర్త మట్టూరి భద్రయ్య మృతి చెందాడు. రెండురోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి చెందడంతో లింగాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!