News September 4, 2024
రద్దు చేసిన దూర ప్రాంత ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ
భారీ వర్షాల కారణంగా రద్దు చేసిన దూర ప్రాంతాల సర్వీసులన్నింటినీ ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు పునరుద్ధరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, రోడ్ల మీద వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లాల్సిన 14 బస్సులు, విజయవాడ, ఆపై ప్రాంతాల నుంచి విశాఖ రావలసిన ఆరు బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సును మాచర్ల మీదుగా నడుపుతున్నారు.
Similar News
News November 17, 2024
పరవాడ ఎస్ఐ సస్పెండ్
పరవాడ ఎస్ఐ ఎం. రామారావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు డీఐజీ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల క్రితం నాతవరం నుంచి రామారావు బదిలీపై పరవాడ వచ్చారు. నాతవరం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో ఓ సివిల్ తగాదాలలో తలదూర్చిన కారణంగా రామారావు సస్పెండ్ చేసినట్లు తెలిసింది. సివిల్ తగాదాకు సంబంధించి ఓ మహిళ డీఐజీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ నిర్వహించి సస్పెండ్ చేశారు.
News November 17, 2024
దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్: అరకు ఎంపీ
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పేరిట మోసం చేశారంటూ వైఎస్.జగన్ అన్నారు. ఈ వీడియోను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి తన ‘x’ అంకౌంట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ పోస్టపై ‘@ncbn నీకు దమ్ముంటే ముందు హామీలు అమలు చెయ్. చేతకాకుంటే పదవి నుంచి తప్పుకో. అంతేకానీ ప్రశ్నించే వాళ్లను జైలులో పెట్టి హీరోనని ఫీల్ అయిపోతే ఎలా?’ అంటూ రాసుకొచ్చారు.
News November 17, 2024
విశాఖ: ‘గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి చర్యలు’
గంజాయి స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఉత్తరాంధ్రలో 8 జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులతో విశాఖ పోలీస్ రేంజ్ కార్యాలయంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి సమావేశం నిర్వహించారు. గంజాయి సాగుకు ఆర్థికంగా మద్దతిస్తున్న వ్యాపారులపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.