News August 29, 2024
రాచకొండలో 19 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
రాచకొండలో 19 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్లో ఉన్న ఆరుగురు ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించారు. ఉప్పల్ డీఐగా రామలింగారెడ్డిని, పహడీ షరీఫ్ డీఐగా దేవేందర్, మాడ్గుల సీఐగా జగదీష్, ఎల్బీనగర్ సీఐగా వినోద్ కుమార్, తదితరులకు పోస్టింగ్ ఇచ్చారు.
Similar News
News January 22, 2025
HYD: రైల్వే ట్రాక్‌పై అమ్మాయి తల, మొండెం (UPDATE)
జామై ఉస్మానియాలో అమ్మాయి సూసైడ్ కేసులో అసలు విషయం వెలుగుచూసింది. కాచిగూడ రైల్వే పోలీసుల వివరాలు.. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్గవి హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో భయపడింది. తల్లిదండ్రులకు చెబితే ఏమవుతుందోనన్న ఆందోళనతో <<15212047>>రైల్ కింద పడి ఆత్మహత్య<<>> చేసుకుంది. ఉస్మానియా మార్చురీలో బిడ్డను చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
News January 22, 2025
HYD నుంచి బీదర్ వరకు IAF టీం సైకిల్ యాత్ర
HYD బేగంపేట నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ వరకు 20 మంది సభ్యులతో కూడిన IAF బృందం సైకిల్ యాత్ర చేసినట్లుగా తెలిపింది. ఇందులో ఇద్దరు మహిళ ఆఫీసర్లు ఉన్నట్లుగా పేర్కొంది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయడం పట్ల త్రివిధ దళాల అధికారులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. IAF అధికారుల సైకిల్ యాత్రను పలువురు ప్రశంసిస్తున్నారు.
News January 22, 2025
HYD: పజ్జన్నను ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విషయాన్ని తెలుసుకున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పద్మారావుగౌడ్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చికిత్స అనంతరం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని పద్మారావుగౌడ్ కేటీఆర్‌కు తెలిపారు. తగిన విశ్రాంతి తీసుకొని మళ్లీ కార్యక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ఆయనకు సూచించారు.