News April 7, 2025
రాచువారిపల్లెలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

పుట్టపర్తి మండలంలోని రాచువారి పల్లి గ్రామ సమీపంలో విద్యుత్ షాక్‌తో రైతు నంబూరి ప్రసాద్ మృతి చెందాడు. సోమవారం గ్రామ సమీపంలోని తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. నియంత్రిక వద్ద ఫీజు ఎగిరిపోవడంతో దానిని వేయడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా షాక్ సర్క్యూట్ కావడంతో అక్కడికక్కడే మృతి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు.
Similar News
News April 8, 2025
విజయవాడలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ ఆఫీస్

AP: విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కొత్త ఆఫీస్‌ను నేడు ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లూ పాస్‌పోర్టు ముద్రణ, జారీ కోసం వైజాగ్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు పంపిస్తుండగా ఇకపై ఇక్కడే ముద్రించనున్నారు. దీంతో పాస్‌పోర్ట్ జారీ సమయం గణనీయంగా తగ్గనుంది. తప్పొప్పుల సవరణను కూడా ఇకపై 3 గంటల్లోనే పూర్తిచేయనున్నారు.
News April 8, 2025
ఆదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని KRK కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. భాగ్యలక్ష్మి, గంగన్న అనే ఇద్దరు.. అమాయక మహిళలు, యువతులకు డబ్బు ఆశ చూపుతూ వ్యభిచారం చేయిస్తున్నట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఇద్దరు బాధిత మహిళలను అదుపులోకి తీసుకొని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పించామన్నారు. నిందితులైన భాగ్యలక్ష్మి, గంగన్నతో పాటు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News April 8, 2025
సిరిసిల జిల్లాలో విషాదం.. తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతితో రుద్రంగిలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆదివారం పుష్పలత(35) చనిపోగా.. సోమవారం కొడుకు నిహాల్ తేజ్(6) మృతిచెందాడు. దీంతో మృతురాలి బంధువులు అత్తింటిపై దాడి చేశారు. తమ కూతురు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హామీతో శాంతించారు. శుక్రవారం రాత్రి చపాతి తిన్న ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.