News March 16, 2025
రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు: ఎమ్మెల్యే ఏలూరి

సీఎం చంద్రబాబు ప్రజల ఆశీస్సులతో అరుదైన గౌరవం దక్కించుకున్నారని ఆయన రాజకీయ ప్రయాణం అందరికీ ఆదర్శనీయమన్నారు. అభివృద్ధి, సంక్షేమం, కటోర శ్రమ, సామాజిక న్యాయానికి చంద్రబాబు ప్రతీకని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. సీఎం చంద్రబాబుకు కార్యకర్తలే బలమే శ్రీరామరక్ష అన్నారు. సీఎం చంద్రబాబు శాసనసభలో తొలి ప్రమాణస్వీకారానికి నేటితో 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారని, రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు.
Similar News
News March 17, 2025
HYD: అమెరికాలో ప్రమాదం.. కొందుర్గు వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన BRS నాయకుడు, మాజీ MPTC, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ప్రగతి అత్త సునీత సిద్దిపేట జిల్లా బక్రీ చప్రియాల్ గ్రామం. అయితే, అంత్యక్రియలు అక్కడే చేస్తున్నట్లు సమాచారం.
News March 17, 2025
డీఎంకే లక్ష్యంగా బీజేపీ ఆందోళనలు

తమిళనాడులో డీఎంకే సర్కార్ టార్గెట్గా బీజేపీ ఆందోళనలకు దిగింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ పిలుపునివ్వగా పార్టీ చీఫ్ అన్నామలై సహా కీలక నేతలు హౌస్ అరెస్టయ్యారు. లిక్కర్ అమ్మకాల ద్వారా డీఎంకేకు రూ.1000 కోట్లు ముట్టాయని బీజేపీ ఆరోపణలకు పాల్పడుతోంది. రూపీ(₹) సింబల్ పేరుతో డీఎంకే నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
News March 17, 2025
అమెరికాలో ప్రమాదం.. రంగారెడ్డి జిల్లా వాసులు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసులు చనిపోయారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతిరెడ్డి(35), మనవడు హార్వీన్ (6), సునీత (56) మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.