News February 13, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంశాలు
@ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ ఓట్లు అడగాలి: బీజేపీ నేతలు@ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలి: మాస్టర్ ట్రైనర్లు @ 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు: బ్లాక్ కాంగ్రెస్ @రోడ్డు పనుల్లో అధికారుల జాప్యం @రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ శుభ్రం చేస్తున్న అధికారులు @వేములవాడ రాజన్న సేవలో యూఎస్ఏ భక్తురాలు @CC రోడ్డు డ్రైనేజీ నిర్మాణపనులు ప్రారంభం
Similar News
News February 13, 2025
డోన్‌లో అద్భుత దృశ్యం
డోన్ పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ఆలయంపై మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నేడు సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు ఆలయానికి వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం కనిపించింది. స్థానికులు ఆసక్తిగా తిలకించి తన ఫోన్లలో బంధించారు.
News February 13, 2025
42 మంది నెల్లూరు కార్పొరేటర్లకు నోటీసులు
ఇటీవల నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో 42 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. అయితే 42 మంది కార్పొరేటర్లు విప్ ధిక్కరించారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కార్తీక్ వారికి నోటీసులు జారీ చేశారు. జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన కరిముల్లాకు కాకుండా కూటమి బలపరిచిన అభ్యర్థికి 40 ఓట్లు వేయగా, ఇద్దరు ఓటింగుకు పాల్గొనలేదు.
News February 13, 2025
స్థానిక సంస్థల్లో నోటా.. పార్టీలు ఏమన్నాయంటే?
TG: ఏకగ్రీవం లేకుండా <<15405631>>ఎన్నికల నిర్వహణపై<<>> ఈసీతో భేటీలో ఎన్నికల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించొద్దని కాంగ్రెస్, సీపీఎం సూచించాయి. రీ ఎలక్షన్ నిర్వహించాలని BRS, సీపీఐ, జనసేన, ఆప్ పేర్కొన్నాయి. మరోవైపు సుప్రీం కోర్టు తీర్పు వచ్చాకే దీనిపై స్పందిస్తామని బీజేపీ తెలిపింది. దీంతో ఎన్నికల నియమావళిలో మార్పుపై త్వరలోనే ఈసీ నిర్ణయం తీసుకోనుంది.