News March 15, 2025
రాజమండ్రి: 23 నుంచి సీపీఐ రాజకీయ ప్రచార జాత

రాజ్యాంగ పరిరక్షణ, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయమే లక్ష్యంగా మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు సీపీఐ రాజకీయ ప్రచార జాత నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. రాజమండ్రిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఐ వందేళ్ల చరిత్రను నాటకాల ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఈ క్రమంలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News March 16, 2025
రాజమండ్రి: క్యారమ్స్ ఆడిన కలెక్టర్, ఎస్పీ

నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన క్యారం బోర్డు వద్దకు కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్‌లు వెళ్లి ఆటవిడుపుగా కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. బిజీ బిజీగా ఉండే కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌లు తిరుగు పయనంలో క్యారమ్స్ ఆడి వినోదం పొందారు. ఆ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News March 16, 2025
రాజమండ్రి: 16న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లకు స్క్రీనింగ్ టెస్ట్

ఏపీపీఎస్సీ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల స్క్రీనింగ్ పరీక్షలు మార్చి 16వ తేదీన నిర్వహిస్తున్నట్లు జేసీ ఎస్.చిన్న రాముడు తెలిపారు. పరీక్షల నిర్వహణపై రాజమండ్రిలో సమీక్ష నిర్వహించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హల్ టికెట్‌తో పాటు, ప్రభుత్వం గుర్తించి అసలు ఫోటో గుర్తింపు కార్డుతో పరీక్ష ప్రారంభించడానికి గంట ముందే.. ఎగ్జాం సెంటర్‌కు చేరుకోవాలని చెప్పారు.
News March 15, 2025
రాజమండ్రి: రైల్వే చీఫ్ క్రూ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు

దక్షిణ మధ్య రైల్వే రాజమండ్రిలో చీఫ్ క్రూ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇదే పదవిలో ఉన్న బీవీ బీకే రెడ్డి స్వచ్ఛందంగా రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు, క్రిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీనివాసరావు తెలిపారు.