News March 24, 2025

రాజమండ్రి: 27న ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు

image

జిల్లాలో వివిధ కారణాలు వల్ల ఖాళీగా ఉన్న 12 ఉపసర్పంచ్ పదవులకు ఈనెల 27న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు డీపీవో శాంతామణి అన్నారు. రాజమండ్రి డివిజన్‌లో మల్లవరం, పాతతుంగపాడు, లక్ష్మినరసాపురం, మర్రిపూడి, మురమండ, మునికుడలి, కొవ్వూరు డివిజన్‌లో పెనకనమెట్ట, కొవ్వూరుపాడు, గోపాలపురం, వెంకటాయపాలెం, తాడిపూడి, ఉంద్రాజవరం పంచాయతీల ఉపసర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి. EOPR&RD ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News March 29, 2025

తూ.గో: పదో తరగతి పరీక్ష వాయిదా- DEO

image

ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న (మంగళవారం) నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు అన్నారు. సోషల్ పరీక్ష మంగళవారం యథావిధిగా జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు.

News March 28, 2025

అనపర్తి: కాలువలో పడి 4ఏళ్ల చిన్నారి మృతి

image

అనపర్తి మండలం కొప్పవరంలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. 4ఏళ్ల చిన్నారి అనూష భార్గవి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయింది. చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయిందని తండ్రి దొరబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇంటి పక్కనే పంట కాలువ ఉండడంతో ఆ కోణంలో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం పాప మృతదేహం లభించింది.

News March 28, 2025

కొవ్వూరు: ప్రభాకర్ మర్డర్ కేసులో వీడని మిస్టరీ..

image

కొవ్వూరు మండలం దొమ్మేరులో గురువారం జరిగిన పి.ప్రభాకర్ మర్డర్ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. ఆయుర్వేదం షాప్ నడుపుతున్న ఆయనకు బుధవారం రాత్రి ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లి పొలంలో విగతజీవిగా మారాడు. దుండగులు అతడిపై కత్తితో దాడి చేసి కుడి చేతిని నరికి హస్తాన్ని తీసుకుపోయారు. సీసీ ఫుటేజ్, చివరి ఫోన్ కాల్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏఎస్పీ సుబ్బరాజు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

error: Content is protected !!