News March 16, 2025
రాజమండ్రి: అమెరికా నుంచి వచ్చానని అమ్మాయిలకు వల

అమ్మాయిలను మ్యాట్రిమోనీ, షాదీ డాట్‌కాం ద్వారా మోసగిస్తున్న రాజమండ్రికి చెందిన వంశీకృష్ణను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు.. నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని అమెరికా నుంచి వచ్చానని, ఎన్నారైలను, రెండో పెళ్లికోసం చూస్తున్న వారి వద్ద డబ్బులు కాజేశాడు. డబ్బులు ఇవ్వమని అడిగిన వారి ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. వంశీపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి.
Similar News
News March 16, 2025
మీపై నమ్మకం ఉంచుకోండి: సీఎం చంద్రబాబు

AP: రేపటి నుంచి టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘పరీక్షలు మీ విద్యా ప్రయాణంలో ఓ కీలకమైన మైలురాయి. దృష్టి కేంద్రీకరించి కష్టపడి పని చేయండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే విజయం వెంటాడుతుందని గుర్తుంచుకోండి’ అని ట్వీట్ చేశారు.
News March 16, 2025
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

AP: ఇటీవల శ్రీశైల మల్లన్న భక్తులు పలువురు నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవడంతో ఆలయం ఈవో శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలన్నారు. www.srisailamdevasthanam.org, www.aptemples.ap.gov.in దేవస్థానం, దేవాదాయ శాఖ వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలన్నారు. దేవస్థానం వివరాలకు 83339 01351, 52, 53 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News March 16, 2025
ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యం: కిషన్ రెడ్డి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడపిల్లలకు చదువు ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో రాజీ పడవద్దని, చదువుతోనే పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. గాంధీనగర్ సురభి బాలవిహార్ స్కూల్ దగ్గర SRK గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉదాన్ ఉత్సవ్–2025 కు కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు.MLA ముఠా గోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు.