News March 30, 2025
రాజమండ్రి: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ ప్రశాంతి

శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకి శనివారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల కలయికతో ఉగాది పండుగ రోజు తయారు చేసుకునే ఉగాది పచ్చడి ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. షడ్రుచులుల కలయికతో కూడిన మధురం అనగా తీపి, ఆమ్లం అనగా పులుపు, లవణం అనగా ఉప్పు, కటువుగా అనగా కారం, తిక్ అనగా చేదు, కషాయం, వగరులతో కలిసి ఉగాది అని అన్నారు.
Similar News
News April 2, 2025
రాజమండ్రి: ఆందోళనకరంగా నాగాంజలి ఆరోగ్య పరిస్థితి

వేధింపులు తాళలేక ఆత్మయత్నానికి పాల్పడి బొల్లినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫార్మసిస్ట్ ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అత్యవసర విభాగానికి తరలించినట్లు డా. పీవీవీ సత్యనారాయణ, డా. అనిల్ కుమార్, డా. సీ.హెచ్. సాయి నీలిమ ప్రభుత్వ వైద్య బృందం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రక్తపోటు, పల్స్, శ్వాసక్రియ, నాడీ వ్యవస్థ స్పందన తక్కువగా ఉందన్నారు.
News April 2, 2025
రాజమండ్రి: కోర్టు సంచలన తీర్పు

మైనర్ కుమార్తెపై అత్యాచారం కేసులో నేరం రుజువు కావడంతో న్యాయ స్థానం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించినట్లు చాగల్లు ఎస్సై కె. నరేంద్ర తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..చాగల్లు మండలంలో 2020లో తన మైనర్ కుమార్తెపై ఆమె తండ్రి అత్యాచారం చేయగా గర్భం దాల్చింది. అప్పటి డీఎస్పీ రాజేశ్వరి అరెస్ట్ చేశారు. కేసులో న్యాయస్థానం తండ్రికి యావజ్జీవ శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.
News April 2, 2025
రాజమండ్రి: అమరావతి చిత్రకళా ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ

స్థానిక లాలా చెరువు రహదారి ప్రధాన మార్గంలో ఏప్రిల్ 4న జరిగే ‘అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన’కు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఎమ్.మల్లిఖార్జున రావులతో అమరావతి చిత్రకళా వీధి ప్రదర్శన గోడ ప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు.