News February 7, 2025
రాజమండ్రి: పార్కులు థీమ్స్ పార్క్‌లు అభివృద్ధి చేయాలి- కలెక్టర్

రాజమండ్రిలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్‌లతో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ఆమేరకు పనులు పూర్తి చెయాలని తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె మాట్లాడారు. నగరంలోని 26 పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు.
Similar News
News December 13, 2025
ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
News December 13, 2025
డిసెంబర్ 20 నుంచి RTC డోర్ డెలివరీ మాసోత్సవాలు: DPTO

ఈనెల 20 నుంచి జనవరి 19 వరకు APSRTC డోర్ డెలివరీ మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తూ.గో జిల్లా ప్రజా రవాణా అధికారి వై.ఎస్.ఎన్. మూర్తి శనివారం ప్రకటించారు. నగరాలలో 10 కి.మీ పరిధిలో 50 కేజీల వరకు పార్శిల్స్ డోర్ డెలివరీ జరుగుతుందన్నారు. తక్కువ ధరతో వేగంగా.. సురక్షితంగా మీ ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ సౌకర్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
News December 13, 2025
‘స్క్రబ్ టైఫస్’పై భయాందోళనలు వీడాలి- DMHO

‘స్క్రబ్ టైఫస్’పై ప్రజల్లో అపోహలు, భయాందోళనలు వద్దని DMHO డా. కె.వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 3 ‘స్క్రబ్ టైఫస్’ కేసులు మాత్రమే గుర్తించామనిని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా నిర్ధారణ అయినవేనని తెలిపారు. జిల్లాలో ఎక్కడా ‘స్క్రబ్ టైఫస్’ వ్యాప్తి పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ‘స్క్రబ్ టైఫస్’ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధి కాదన్నారు.


