News March 24, 2025
రాజమండ్రి: మర్డర్ కేసులో పట్టుబడ్డ నిందితుడు

రాజమండ్రి రూరల్ హుకుంపేట డీ బ్లాక్‌లో ఆదివారం తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో నిందితుడు పల్లి శివకుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా నిందితుడు ముళ్ల కంచెలలో నుంచి పరారవుతున్న సమయంలో కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి వెంబడించారు. నిందితుడి నుంచి ప్రతిఘటన ఎదురవడంతో ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ధైర్యసాహసాలతో ఎస్సై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 19, 2025
ANU: బీ ఫార్మసీ రెండవ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో అక్టోబరు నెలలో జరిగిన బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. విడుదల చేసిన I, IV సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో 70.98% ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్ కోసం ఈనెల 30వ తేదీ లోపు రూ.2,070 నగదు చెల్లించాలన్నారు. వివరాలకు వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ ను సంప్రదించాలన్నారు.
News December 19, 2025
‘3 ఇడియట్స్’ సీక్వెల్ టైటిల్ ఏంటంటే?

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించనున్న ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌కు టైటిల్ ‘4 ఇడియట్స్’ అనుకుంటున్నారని తెలుస్తోంది. తొలి పార్టులో నటించిన ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషితో పాటు మరో సూపర్ స్టార్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ మూవీ 3 ఇడియట్స్ కంటే భారీగా ఉండనుందని వెల్లడించింది. నాలుగో క్యారెక్టర్‌కు న్యాయం చేసేలా కొన్ని కొత్త అంశాలు ఉంటాయని పేర్కొంది.
News December 19, 2025
18 లక్షల మందితో YCP సైన్యం: సజ్జల

AP: పార్టీ సంస్థాగత నిర్మాణానికి 35 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నామని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతలతో భేటీలో తెలిపారు. ‘గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు సభ్యులందరి డేటాను డిజిటలైజ్ చేస్తాం. అంతా పూర్తయితే 16 నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్ధమవుతుంది. జగన్ మంచి పాలన అందించారు. ఏం కోల్పోయారో ప్రజలకు ఇప్పుడు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. ఆటుపోట్లెన్ని ఉన్నా నిరంతర పోరాటమే లక్ష్యమన్నారు.


