News March 22, 2025

రాజమండ్రి: వివాహం కావడం లేదని ఆత్మహత్య

image

వివాహం కావడం లేదని మనస్తాపం చెంది హుకుంపేట D-బ్లాక్‌కు చెందిన ఉరిటి రామ సుబ్రహ్మణ్యం (45) ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తల్లి వెంకటలక్ష్మి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం రాజమండ్రిలోని ఒక ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు.

Similar News

News March 23, 2025

తూ.గో: క్యాన్సర్ కేసుల నమోదులో భయాందోళనలు వద్దు

image

తూ.గో జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళనలు వద్దని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఆమె బలభద్రపురంలో పర్యటించి అధికారులతో సమీక్షించారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకు గాను 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా, అనపర్తి నియోజక వర్గం బలభద్రపురంలో 23 కేసులు గుర్తించినట్లు తెలిపారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేస్తున్నట్లు తెలిపారు.

News March 22, 2025

RJY: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు

image

సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్, అసభ్యకరమైన, అనైతిక, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు ఉన్నాయని గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఏ విధమైన పోస్ట్లు పెట్టొద్దని ఎస్పీ హితవు పలికారు.

News March 22, 2025

రాజానగరం: సేద్యపు నీటి కుంటను ప్రారంభించిన కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (NREGS)ద్వారా సేద్యపు నీటి కుంటను జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి కొబ్బరికాయ కొట్టి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తోకాడ గ్రామం నుంచే మొట్టమొదటిగా ఇంకుడు గుంట కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆమె అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులైన నీటిని ఒడిసిపెట్టి, దాచి నట్లయితే రాబోయే తరాలవారికి మంచి తాగునీటిని అందించగలమని అన్నారు.

error: Content is protected !!